• Neti Charithra

పిటిఎం ను రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రభుత్వం.. ఆంక్షలు విధించిన పోలీసులు !






పిటిఎం ను రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రభుత్వం.. ఆంక్షలు విధించిన పోలీసులు !






పిటిఎం: నేటి చరిత్ర


(పిటిఎం లో పోలీస్ పహారా)

(పిటిఎం పారిశుధ్యం పనులు చేస్తున్న సిబ్బంది)

(పిటిఎం లో నిర్మానుషం గా మారిన దృశాలు)

చిత్తూరు జిల్లా పిటిఎం ను ప్రభుత్వం రెడ్ జోన్ ఏరియగా ప్రకటించింది. మండల కేంద్రం లో ముంబై నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ రావటంతో ముందస్తు చర్యలు లో భాగంగా పిటిఎం లో పోలీసులు సోమవారం రెడ్ జోన్ ఏరియగా ప్రకటించారు. మరో వైపు స్థానికులు

ప్రధాన విధుల లో ఇతరుల రాక పోకలు ను నిషేధిస్తూ.. పలు వీధులలో ప్రజలు స్వచ్ఛందంగా కొయ్యలు, రాళ్లు, ముళ్ల

కంపలు వేసి రహదారులను దిగ్బంధం చేశారు. ఎస్ ఐ సుబ్బారెడ్డి సిబ్బందితో కలిసి భద్రతా చర్యలు చేపట్టారు.



పిటిఎం లో పోలీసుల హెచ్చరిక !


మండల కేంద్రం పిటిఎం లో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటం తో ఎస్ ఐ సుబ్బారెడ్డి పలు ఆంక్షలు విధించారు. ప్రజలు అనవసరం తిరిగితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనవసరంగా తిరిగే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. అత్యవసర పనుల పై బయటకు వచ్చే వారు తప్పని సరిగా మాస్కులు ధరించాలని మాస్కులు ధరించని వారిపై ఫైన్ లు విధిస్తామని ఆయన హెచ్చరించారు.



846 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon