• Neti Charithra

పిచ్చి కుక్కల భీభచ్చం... 60 మంది విద్యార్థులు కు కుక్క కాట్లు !

పిచ్చి కుక్కల భీభక్షం.. 60 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు !

హైదరాబాదు: నేటి చరిత్ర (జనవరి21)

హైదరాబాద్‌ నగరంలోని అమీర్‌పేట్‌లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తున్న విద్యార్థులపై పిచ్చికుక్కలు దాడి చేయడంతో సుమారు 60 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ధరమ్‌కరమ్‌ రోడ్డులో చోటు చేసుకుంది. కుక్కలు ఒక్కసారిగా విద్యార్థులపైకి దూసుకుని రావడంతో వారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు.

ఈ క్రమంలో పిచ్చికుక్కలు వారిపై దాడి చేసి గాయపరిచాయి. గాయాలపాలైన విద్యార్థులను నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రితో పాటు నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు కూడా పిచ్చి కుక్కలను వెంబడించి ఓ కుక్కను కూడా చంపేశారు.

వీధుల్లోకి కుక్కలు చేరాయని.. తమ పిల్లలను బయటకు పంపేందుకు భయపడుతున్నామంటూ తల్లిదండ్రులు ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

24 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon