• Neti Charithra

పుంగనూరు లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు.. రూ.4.33 లక్షల ఎరువులు.. మందులు సీజ్..!


పుంగనూరు లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు.. రూ.4.33 లక్షల ఎరువులు.. మందులు సీజ్..!



పుంగనూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో పురుగు మందులు,ఎరువులు మరియు విత్తనాల దుకాణాలలో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పుంగనూరు మండల వ్యవసాయధికారిని సంధ్య మాట్లాడుతూ పుంగనూరు పట్టణంలో అనుమతులు లేని ఎరువులు,విత్తనాలు మరియు పురుగు

మందుల దుకాణాలను గత వారం రోజులు గా పరిశీలించడం తో పాటు అనుమతులు లేని దుకాణాలను వెంటనే అమ్మకాలను నిలిపివేత చేసి వాటిని అనుమతి తీసుకొని వలసిందిగా కోరడం జరిగిందని తెలిపారు. ఈ మధ్యకాలంలో అన్నదాత ట్రేడర్స నందు తనిఖీ చేసి సుమారు 4 లక్షల 33 వేల 70 రూపాయలు అనుమతులు నిలిపివేస్తూ మరియు పురుగు మందులు నమూనాను

పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు పంపడం జరిగిందన్నారు. తప్పనిసరిగా రైతులందరికీ బిల్లులు ఇవ్వాలని నాణ్యమైన పురుగు మందులు ఎరువులు విత్తనాలను మాత్రమే అనుమతి తీసుకొని రైతులకు అందజేయాలని ఈ సందర్భంగా పురుగు మందులు మరియు ఎరువుల విత్తనాల దుకాణాల యజమానులకు తెలియజేయడం జరిగిందన్నారు.


163 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon