• Neti Charithra

పాకిస్తాన్ లో భూకంపం.. 15 మంది మృతి!

#పాకిస్తాన్ లో భూకంపం.. 15 మంది మృతి!

పాకిస్థాన్: నేటి చరిత్ర (సెప్టెంబర్24) లాహోర్ కు వాయవ్య దిశగా 173 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం పాకిస్థాన్ ను వణికించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం ధాటికి పాక్ లో 15 మంది వరకు మరణించారు. 150 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. భూకంపం ధాటికి ఇళ్లు, ఆఫీసులు ధ్వంసమయ్యాయి. భూకంపం ధాటికి ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూకంప ప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ పలు చోట్ల ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon