• Neti Charithra

పశు వైద్య శాఖ లోని ఔట్ సోర్సింగ్ సిబ్బందికి న్యాయం చేయండి- జానం గంగిరెడ్డి

#పశు వైద్య శాఖ లోని ఔట్ సోర్సింగ్ సిబ్బందికి న్యాయం చేయండి- జానం గంగిరెడ్డి

ప్రొద్దుటూరు: నేటి చరిత్ర (సెప్టెంబర్13) కడప జిల్లా ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని ఏఐటీయూసీ,బహుజన ప్రజాసంఘాల నాయకుడు జానం గంగిరెడ్డి డిమాండ్ చేసాడు.ఈ రోజు పై కళాశాల ప్రిన్సిపల్ కె.మురళీకృష్ణ ను పశువైద్యకళాశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యములో కలసిన సందర్భములో మాట్లాడుతూ ఈ మధ్య సీనియర్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా ఐదు మందిని నేరుగా ఉద్యోగములోకి తీసుకున్నారని ఇది అన్యాయమని వెంటనే సీనియర్లకు వారి అర్హతలను బట్టి పదోన్నతి ఇవ్వాలని లేనిపక్షంలో తిరుపతి ఎస్.వీ పశుసంవర్ధక విశ్వవిద్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యములో ధర్నా చేపడతామని హెచ్చరించాడు. పై కార్యక్రమములో జానం గంగిరెడ్డి తోపాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగసంఘ నాయకులు బాలుడు,మైకేల్,శ్రీనాధరెడ్డి,సూరి,దేవహుస్సేన్,చెన్నకేశవులు,క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon