• Neti Charithra

పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

#పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

అమ‌రావ‌తి: నేటి చరిత్ర (సెప్టెంబర్2) జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కల్యాణ్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీనటులుగా అశేష ప్రేక్షకాభిమానాన్ని పవన్ కల్యాణ్ సంపాదించారని చంద్రబాబు ఆదివారం ప్రశంసించారు. విశిష్ట వ్యక్తిత్వంతో ఆయన ప్రజల పక్షాన నిలిచి సేవలు అందిస్తున్నారని కితాబిచ్చారు. పవన్ కల్యాణ్ నిండు నూరేళ్లు, ఆనందారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు, ఓ ఫొటోను పోస్ట్ చేశారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon