• Neti Charithra

నెల్లూరు లో నిరాడంబరంగా రొట్టెల పండుగ ... గంధం ఉత్సవానికి కడప పెద్ద దర్గా పీఠాధిపతి రాక..!


నెల్లూరు లో నిరాడంబరంగా రొట్టెల పండుగ ... గంధం ఉత్సవానికి కడప పెద్ద దర్గా పీఠాధిపతి రాక..!



నెల్లూరు: నేటి చరిత్ర


కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది

నెల్లూరు లో రొట్టెల పండుగ నిరాడంబరంగా బారాషహీద్‌ దర్గాలో గంధోత్సవం ప్రారంభమైంది. దర్గాలోని స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి జరగకుండా

బారికేడ్లు ఏర్పాటుచేశారు. భక్తులు రాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముజావర్లు రఫీ, షాహుల్‌, వక్ఫ్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్‌ అహ్మద్‌బాషా, మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్‌హమీద్‌ సంప్రదాయ ప్రకారం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ఉత్సవ ప్రార్థనలు, ఫాతెహాలు చేసి, దువా చేశారు. సొందల్‌ మాలి సందర్భంగా దర్గా శుభ్రం చేశారు. పీర్ల పంజాలను ప్రతిష్ఠించి ప్రార్థనలు చేశారు. రొట్టెల మార్పిడి రద్దు చేయడంతో దర్గా ప్రాంగణం భక్తుల లేక బోసిపోయింది. దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చినా దర్గాలోకి పోలీసులు ప్రవేశం కల్పించడం లేదు.

గంధోత్సవం సోమవారం రాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుందని వక్ఫ్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్‌ అహ్మద్‌బాషా వివరించారు. కడప పెద్ద దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుస్సైనీ చేతుల మీదుగా గంధాన్ని సమర్పించ నున్నారు.


105 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon