• Neti Charithra

నిమ్మనపల్లె కు తాకిన కరోనా.. మొదటి సారి రెండు కేసులు నమోదు !


నిమ్మనపల్లె కు తాకిన కరోనా.. మొదటి సారి రెండు కేసులు నమోదు !



నిమ్మనపల్లి: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా నిమ్మనపల్లి మండలంలో తొలిసారిగా కరోన పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారిని జులేఖ భేగం తెలిపారు. ఇటీవల పుంగనూరు దొబి కాలనీకి చెందిన మహిళకు కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మండలంలోని

రెడ్డివారిపల్లిలో ఆమెతో సన్నిహితంగా ఉన్న 10 మందిని గుర్తించి వారిని వికృతమాల క్వారంటైన్ కు మండల అధికారులు తరలించారు. వారికి స్వాబ్ పరీక్షలు నిర్వహించిగా సోమవారం వెలువడిన ఫలితాల్లో మండల పరిధిలోని చినేపల్లికి చెందిన ఒక మహిళ(28), పురుషుడు(60) ఇద్దరికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ

అయినట్లు తెలిపారు. వీరికి మొదటిసారి స్వాబ్ పరీక్షలు చేయగా నిగేటివ్ గా వచ్చిందని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయడానికి రెండవసారి పరిక్షలు చేయగా పాజిటివ్ గా ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. దీనితో ఆ ప్రాంతం రెడ్ జోన్ పరిధిలోకి వచ్చింది.

795 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon