• Neti Charithra

నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారిక కార్యక్రమాలు !

#నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారిక కార్యక్రమాలు !

తిరుపతి: నేటి చరిత్ర (సెప్టెంబర్30) సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా పర్యటనకు రానున్నారు. జిల్లా అధికారుల సమాచారం మేరకు.. * మధ్యాహ్నం 2:40 కి గన్నవరం విమానాశ్రయం నుండి బయలు దేరి మధ్యాహ్నం 3:30 లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని 3:50 తిరుచానూరు శ్రీ పద్మావతి నిలయం ప్రారంభం అనంతరం 04:15 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం ఆతర్వాత 4:45 నిముషాలకు అలిపిరి వద్ద చెర్లోపల్లి అలిపిరి నాలుగు లైన్ల రహదారికి శంకుస్థాపన, సాయంత్రం 5:20 నిముషాలకు తిరుమల లో మాతృశ్రీ వకుళమాత అతిథి గృహం ప్రారంభం. అనంతరం శ్రీ పద్మావతి అతిథిగృహం చేరుకుంటారు. రాత్రి 7.00 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించి రాత్రి 8.00 గంటలకు వాహన మండపం వద్ద పెద్ద శేష వాహనం సేవలో పాల్గొని రాత్రి బస చేస్తారు. మంగళవారం ఉదయం ఉదయం *9.40* రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం తిరుగు ప్రయాణం అయ్యేలా సీఎం పర్యటన ఖరరాయినట్లు అధికార వర్గాల సమాచారం.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon