• Neti Charithra

నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి.... మూడు కుటుంబాల్లో విషాదం!


నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి.... మూడు కుటుంబాల్లో విషాదం!



వరంగల్ : నేటి చరిత్ర


వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బీమారంలో గల పుట్టలమ్మ రిజర్వాయర్ లో గురువారం

ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. సంఘటన వివరాలు తెలియాగానే స్థానిక కేయూసీ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే పిల్లలు గల్లంతు కావటంతో స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లని దింపి గాలింపు చర్యలు చేపట్టగా రెండు మృతదేహాలను వెలికి తీశారు. మనివిత్, మహేష్ బాబు మృతదేహాలు బయటికి

తీయగా మరో బాలుడి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు..బీమారానికి చెందిన దొడ్డిపాటి మనివిత్ (11), దొడ్డిపాటి మహేష్ బాబు(14), మ్యూనికుంట్ల విష్ణు తేజ (14) ఈ ముగ్గురు బాలురు సైకిల్ వేసుకొని వచ్చి ప్రమాదవశాత్తు రిజర్వాయర్ లో పడి మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటనతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.



265 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon