• Neti Charithra

నీటి కుంటలో పడి.. ముగ్గురు చిన్నారులుమృతి.. ఆ... కుటుంబాల్లో పెను విషాదం !


నీటి కుంటలో పడి.. ముగ్గురు చిన్నారులుమృతి.. ఆ... కుటుంబాల్లో పెను విషాదం !




విజయనగరం: నేటి చరిత్ర


విజయనగరం జిల్లా లో మంగళవారం పెను

విషాదం చోటు చేసుకుంది. విజయనగరానికి సమీపంలోని పెద్దచెరువు దగ్గర ఊటగుమ్మిలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులు యాగటి జయరాం(15)  బోత్సా నాని(12), బోత్సా దివాకర్(8)గా గుర్తించారు. పెద్దచెరువుకు కిందనున్న మాన్సాస్ భూముల్లో ఇటీవల రోడ్డు కోసం గుంతలు తీశారు. గుంతలో నీరు చేరడంతో స్నానం కోసం వెళ్లి విజయనగరానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మొత్తం 8 మంది చిన్నారులు స్నానానికి వెళ్లారు. వీరిలో ఐదుగురికి ఈత రావడంతో సురక్షితంగా బయటకు చేరుకున్నారు. మిగిలిన ముగ్గురికి ఈత రాకపోవడంతో నీటిలో ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయారు.



131 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon