• Neti Charithra

నల్ల వ్యవసాయ చట్టాలు అమలు నిలుపుదల చేయాలని.. మదనపల్లె లో నిరసనలు..!


నల్ల వ్యవసాయ చట్టాలు అమలు

నిలుపుదల చేయాలని.. మదనపల్లె లో నిరసనలు..!




మదనపల్లె: నేటి చరిత్ర


కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యవసాయ విద్యుత్ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని చిత్తూరు జిల్లా మదనపల్లె లో ఏ పి రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమాలు జరిగాయి.

ఈ సందర్భంగా ఏ పి రైతు సంఘం జిల్లా కార్యద్శి పి ఎల్ నరసింహులు మాట్లాడుతూ, కేంద్రంలో బి జే పీ ప్రభుత్వం రైతులను గొంతు కోసే నల్ల చట్టాలను తీసుకొచ్చి, దేశంలో వున్న రైతాంగాన్ని భహులజాతి కంపెనీలకు బానిసలుగా


చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ నల్ల చట్టాలను తీసుకొస్తున్నారని అన్నారు. ఈ చట్టాలవల్ల రైతులకు కనీస గిట్టుబాటు ధర లేకునాపోతుందన్నారు. కాంట్రాక్ట్ వ్యవసాయం వల్ల భాహులజాతి సంస్థల చేతుల్లోకి వ్యవసాయం పోతుందన్నారు. ఈ చట్టాలవల్లన ఆహార భద్రత లేకున్నా పోతుందన్నారు. ప్రధానంగా పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యం, నిత్యావసర సరుకులు అందకున్నాపోతాయన్నారు. విద్యుత్ సంస్కరణల వల్ల విద్యుత్ ప్రైవేట్ వ్యక్తులకు చేతులలోకి పోయి రైతులకు భారంగా మారుతుంది అని ఆయన అన్నారు. సి పి ఐ నాయకులు యం. సాంబ శివ, కె. మురళి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలకు ఈ రాష్ట్రంలో వున్న వై సీ పీ, టి డి పి పార్టీలు నిసిగ్గుగా పార్లమెంటులో బి జే పీ పార్టీకి అనుకూలంగా ఓటు వేసాయని అనారు. వై యస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వుచ్చిత విద్యుత్ ను ప్రవేశ పెడితే,జగన్ మోహన్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ ను తొలగించి,రైతు మోటర్లకు మీటర్లు పెట్టడానికి జీఓ నెంబర్ 22 తెచ్చారని అన్నారు. ప్రతిపక్ష నేత

చంద్రబాబు నాయుడు గారికి రాజధాని రైతులు తప్పా, రాష్ట్రములో వున్న రైతులు గుర్తుకు రాలేదా అన్నారు. రైతుల గొంతు కోసే నల్ల చట్టాలను రద్దు చేయాలని, రైతుల బోరు మోటార్లకు మాటర్లను అమర్చడాన్ని, జీఓ నెంబర్ 22 ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి పి ఐ,ప్రజాసంఘాల నాయకులు ముభారాక్, సూరి, తిరుమల, రెడ్డెప్పా, రవి,రెడ్డి, నవీన్, మాధవ్, వెంకటేష్, రాజు తదతరులు పాల్గొన్నారు.


77 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon