• Neti Charithra

నర్సులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తిరుపతి లో భారీ నిరసనలు..!


నర్సులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తిరుపతి లో భారీ నిరసనలు..!




తిరుపతి: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా తిరుపతి

రుయా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న నర్సులు గురువారం

గంటపాటు భౌతిక దూరం పాటిస్తూ , మొహానికి మాస్క్ లను ధరించి నిరసనకు దిగేరు . వివరాల్లోకి వెళ్తే

2016 వ సంవత్సరంలో జి. ఓ 44 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో 1000 మంది నర్సులను డైరెక్టరెట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ( డి.యం.ఈ), ప్రిన్సిపాల్ సెక్రటరీ ఉత్తర్వుల మేరకు నియమించడం జరిగినదని ,.

వారిలో తిరుపతి రుయా ఆస్పత్రిలో 70 మంది . మేటర్నిటీ ఆసుపత్రి లో 30 మంది పనిచేయుచున్నారని...ప్రస్తుతం వారు 22500 జీతభత్యాలు అందుకుంటుంటే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 1000 మంది పైగా నర్సులను నియమిస్తున్నారని వారికి 34000 జీతభత్యాలు అందిస్తున్నారని , ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించకుండా ,జీతభత్యాలు పెంచకుండా కొత్తగా వచ్చినవారికి మాత్రం అధిక జీతాలు ఇస్తున్నారని , వారీలాగే ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి జీతభత్యాలు పెంచి , ఉద్యోగ భద్రత కల్పించి తగు న్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపేరు. పాదయాత్ర సమయంలో గౌరవనీయులు సి.యం.గారు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ చేస్తామని తెలిపిన విధంగా రెగ్యులర్ చేసి న్యాయం చేయాలని అభ్యర్థించారు. కరోనా మహమ్మారి కబళిస్తున్న సమయంలో కూడా వెన్ను తిరగని దీక్షతో పాలు తాగే పసి పిల్లలను ,అమ్మ నాన్న లను విడిచి వచ్చి డ్యూటీ లు చేస్తున్నామని , డ్యూటీ కి వచ్చి కరోనా కాటుకు భలి కాకుండా వెళ్లేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కూడా తమలో కొంతమంది కరోనా భారిన పడుతున్నారని కావున తమకు ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు ...డ్యూటీ లో

ఉన్నపుడు ఎవరైన అనారోగ్యానికి గురి అయితే వారికి వేతనంతో కూడిన సెలవులను కల్పించాలని, కోవిడ్ భారిన పడిన నర్సులకు వసతులతో కూడిన వైద్యం అందించాలని కోరుతూ రుయా సూపరింటెండెంట్ శ్రీమతి. భారతి గారికి వినతి పత్రం అందించారు . ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ నర్సులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


175 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon