• Neti Charithra

నడి రోడ్డు పై ..కారులో మంటలు.. నగదు దగ్ధం.. నలుగురికి తప్పిన పెను ప్రమాదం!

హైదరాబాదు : నేటి చరిత్ర (ఫిబ్రవరి 21)

కొత్తగా కొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతి అయింది. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా నేరెడుగొండ మండలం మామడ టోల్‌ గేట్‌ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. కారులో మంటలు రావడంతో... అందులో ప్రయాణిస్తున్నవారు అప్రమత్తమై కారులో నుంచి దిగి దూరంగా వెళ్లిపోయారు. అయితే కారులో ఉన్న లక్ష రూపాయలు బుగ్గిపాలయ్యాయి. అయితే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిసింది. కాగా ప్రమాద సమయంలో కారులో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.

61 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon