• Neti Charithra

నడి రోడ్డు పై ఎస్ ఐ దారుణ హత్య !

Updated: Jan 10

నడి రోడ్డు పై ఎస్ ఐ దారుణ హత్య!

చెన్నై: నేటి చరిత్ర (జనవరి9)

తమిళనాడు లో నడి రోడ్డు పై ఒక ఎస్ఐ ను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతోకాల్చి చంపడం సంచలనం కలిగించింది.తమిళనాడు-కేరళ సరిహద్దులో ఉన్న కన్యాకుమారి జిల్లాలోని కాళియక్కావళిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ విల్సన్‌(56) మరో

ఐదు నెలల్లో పదవీ విరమణ పొందనున్నారు. గురువారం విధుల్లో ఉన్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. నాలుగు రౌండ్లపాటు అతని ఛాతిపై కాల్చడంతో విల్సన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తుపాకీ కాల్పుల చప్పుళ్లు విన్న స్థానికులు ఘటనా స్థలానికి వచ్చి చూసేసరికి ఎస్సై రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే కాళియక్కావళి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించి గాయపడ్డ విల్సన్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. పోస్టు మార్టం నిమిత్తం ఆసరిపల్లంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

89 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon