• Neti Charithra

నటుడు సోనూ సూద్ కు అభినందనలు తెలిపిన నారా లోకేష్..!


నటుడు సోనూ సూద్ కు అభినందనలు తెలిపిన నారా లోకేష్..!



అమరావతి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ కూరగాయల రైతు పొలం దున్నేందుకు డబ్బు లేకపోవడంతో కుమార్తెలు అరక లాగుతుండగా పొలం దున్నడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో

చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఆ పేద రైతుకు ఓ ట్రాక్టర్ కొనిస్తానని ప్రకటించారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. కరోనా కష్టకాలంలో మీరు చేస్తున్న అద్భుతమైన సహాయ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా రైతు కుటుంబం పట్ల మీరు ప్రదర్శించిన సానుభూతి, దయ నిజంగా అభినందనీయం అంటూ ట్వీట్ చేశారు.


185 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon