• Neti Charithra

దేశం లో మొదటి సారి సీఎం కు కరోనా.. అభిమానుల్లో.. కల కలం..!


దేశం లో మొదటి సారి కరోనా.. సీఎం కు కరోనా.. అభిమానుల్లో కల కలం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


మధ్యప్రదేశ్ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు. ''కరోనా లక్షణాలని అనుమానం రావడంతో పరీక్షలు చేసుకున్నా. ఆ పరీక్షలో కరోనా పాజిటివ్‌ అని తేలింది. నాతో వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొన్న వారందరూ కరోనా పరీక్షలు చేసుకోండి. ఇదే నా విన్నపం.

వారందరూ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోండి'' అని ట్విట్టర్‌ వేదికగా శివరాజ్‌ విజ్ఞప్తి చేశారు. వైద్యుల సూచనల మేరకు సిఎం శివరాజ్‌ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కరోనా సమీక్షా సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరవుతానని శివరాజ్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ సోకిన మొట్ట మొదటి ముఖ్యమంత్రి ఈయనే.