• Neti Charithra

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. కారు బోల్తా.. ఇద్దరు మృతి..!


దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. కారు బోల్తా.. ఇద్దరు మృతి..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


విజయవాడ సమీపం నకరికల్లు మండలం చల్లగుండ్ల రోడ్డు వద్దఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు.పోలీసులు కథనం మేరకు..దుర్గి మండలం అడిగొప్పల

గ్రామానికి చెందిన నాలి నాగేశ్వరరావు (35) తన భార్య నాగలక్షి, పిల్లలు కావ్య, నవ్య, అఖిలేష్‌లతోపాటు తల్లి మంగమ్మ, అత్త పున్నమ్మలతో కలిసి కారులో దుర్గమ్మను దర్శనం చేసుకునేందుకు విజయవాడకు వెళ్లారు. అక్కడ అందరూ జగన్మాతను దర్శించుకుని కాసేపు ఆనందంగా గడిపారు. అనంతరం కారులో స్వగ్రామానికి బయలు దేరారు. నకరికల్లు సమీపానికి వచ్చేసరికి వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు

పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. వారిలో పున్నమ్మ (50) అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ ఉదయ్‌బాబు తీవ్రంగా గాయపడిన నాగేశ్వరావును తన కారులో ఆసుపత్రి తరలించగా..ఆయన అక్కడ కన్నుమూశారు.126 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon