• Neti Charithra

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న బులోరో వాహనం.. చిత్తూరుజిల్లాలో ఒకరి మృతి..!


ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న బులోరో వాహనం.. చిత్తూరుజిల్లాలో ఒకరి మృతి..!



కలకడ: నేటి చరిత్ర


రోడ్డు ప్రమాదంలో హెచ్ పిసిఎల్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఆదివారం చిత్తూరు జిల్లా కలకడ మండలంలో చోటుచేసుకుంది.ఎస్ఐ బి. రవి ప్రకాష్ రెడ్డి కధనం మేరకు మండలంలోని పాపిరెడ్డిగారిపల్లికి చెందిన హెచ్ పిసిఎల్

ఉద్యోగి కసిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (36) తన ద్విచక్ర వాహనంలో హెచ్ పిసిఎల్ కు వెళుతుండగా కోన క్రాస్ నుంచి హెచ్ పిసిఎల్ కు వెల్లే దారిలో మణిభూషన్ రెడ్డి

పొలం వద్ద ఎదురుగా వస్తున్న బోలేరో పికప్ వాహనాన్ని బలంగా ఢీకొనడంతో చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి

108లో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తమ్ముడు బాబు రెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి రవిప్రకాశ్ రెడ్డి తెలిపారు.


384 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon