• Neti Charithra

దళిత వర్గాలపై జరిగే దాడులు.. అడ్డుకుంటాం- దళిత ఐక్య వేదిక నేత




బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో జడ్జి రామకృష్ణ పై జరిగిన దాడి దళితుల వర్గాల పై జరిగిన దాడి అని రిటైర్డ్ జడ్జి గుర్రప్ప విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన జడ్జి రామకృష్ణ పై జరిగిన దాడి ఘటన ను వారు

శనివారం అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యమల సుదర్శనం , ఆర్పీ ఐ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య తో కలిసి శనివారం మీడియా తో మాట్లాడుతూ వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత దళిత వర్గాల పై దాడులు, అక్రమకేసులు

పెరుగుతున్నాయన్నారు. తాజాగా జడ్జి రామకృష్ణ విధినిర్వహన లో వందల కొద్ది ఎఫ్ ఐ ఆర్ లు చూసి తీర్పులు చెప్పారని అలాంటి జడ్జి తనకు న్యాయం చేయాలని ఇచ్చిన ఫిర్యాదు సరిగా లేదనడం దారుణం అన్నారు. రామకృష్ణ కు న్యాయం జరిగే వరకు ఆయన కు అండగా ఉంటామన్నారు. ఇటీవల విశాఖ లో డాక్టర్ సుధాకర్, చిత్తూరు జిల్లా లో డాక్టర్ అనిత రాణి లకు జరిగిన

న్యాయం ఏపాటిదో.. రాష్ట్ర ప్రజలు చూసారన్నారు. జడ్జి రామకృష్ణ ను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు కు వారు అభ్యంతరం తెలిపారు. సమావేశం లో దళిత నేతలు డాక్టర్ ప్రసాద్ రావు, గోపి ప్రభుతదితరులు పాల్గొన్నారు



361 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon