• Neti Charithra

తాళి కట్టాడు.. ఏడు అడుగులు.. వేశాడు.. భార్య నగ్న చిత్రాలు యూట్యూబ్ లో పెడతానంటున్న భర్త..!


తాళి కట్టాడు.. ఏడు అడుగులు.. వేశాడు.. భార్య నగ్న చిత్రాలు యూట్యూబ్ లో పెడతానంటున్న భర్త..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


అతను అగ్ని సాక్షి గా భార్య మెడలో తాళి కట్టిన భర్త.. వెన్నంటే ఉండి.. నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సిన వారు. అయితే అతనే చీకటి ఆలోచనలకు శ్రీకారం చుట్టాడు.. భార్య నగ్న చిత్రాలను యూట్యూబ్ లో పెడతానని ఓ భర్తే బరితెగించి ఘటన తెలంగాణా లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కేసు వాపసు తీసుకో.. లేదంటే నీ వ్యక్తిగత ఫొటోలన్నింటిని యూట్యూబ్‌లో పెడతా’ అంటూ భార్యను వేధిస్తున్న సినీ రచయిత యర్రంశెట్టి రమణ గౌతమ్‌పై బంజారాహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌

రోడ్‌ నంబరు 12లోని ఎన్బీటీనగర్‌లో నివసించే రమణగౌతమ్‌ అదే ప్రాంతంలో నివసించే ఓ యువతిని(24) ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. మనస్పర్థలు రావడంతో గతేడాది జూన్‌లో భర్తపై ఆమె వేధింపులు, మోసం కింద బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో కలిసి ఉండేందుకు అంగీకరించారు. కొన్నాళ్ల నుంచి రమణగౌతమ్‌ ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు ఫోన్లు చేసి కేసు వాపసు తీసుకోవాలని , లేదంటే ఆమె నగ్న చిత్రాలను యూట్యూబ్‌లో

పెడతానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని యువతి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరి సినీపరిశ్రమలోనే ఉందని, ఆమె స్నేహితుల వద్ద అసభ్యకరంగా మాట్లాడటం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.


612 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon