• Neti Charithra

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఎన్టీఆర్ జయంతి వేడుకలు !


తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఎన్టీఆర్ జయంతి వేడుకలు !


హైదరాబాద్‌ : నేటి చరిత్ర


నటసార్వ భౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జయంతిని

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాదు లో ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి బాలకృష్ణ, మాజీ సీఎం

చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి లతో పాటుఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ లో

నివాళులర్పించారు. ఏపీ లోని గుంటూరు జిల్లా ఎన్టీఆర్ భవన్ లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ ల తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు.

పలు చోట్ల అభిమానులు ఎన్టీఆర్‌ విగ్రహాలకు

పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఎన్టీఆర్‌

ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఎన్టీఆర్‌ నటించిన సినిమాలు కూడా చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు.

31 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon