• Neti Charithra

తెలంగాణా కు కేంద్రం ఆదుకోవాలి.. అమిత్ షా ను కోరిన సీఎం కేసీఆర్!

#తెలంగాణా కు కేంద్రం ఆదుకోవాలి.. అమిత్ షా ను కోరిన సీఎం కేసీఆర్!

ఢిల్లీ: నేటి చరిత్ర (అక్టోబర్4) కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం పార్లమెంట్‌లోని నార్త్‌ బ్లాక్‌లో సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. అమిత్‌ షా తో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సిఎం కెసిఆర్‌ చర్చించారు. మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ తో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రెండు జీవనదుల అనుసంధానం జరిగితే తెలుగు రాష్ట్రాల్లోని బీడు భూములన్నింటికీ సాగునీరు అందించే అవకాశం ఉండటంతో.. అతి కీలకమైన ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించాలని సీఎం కేసీఆర్‌ ప్రధానిని కోరే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రధానిని చాలాసార్లు కోరినప్పటికీ ఇవ్వలేదు. తాజాగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ఉండటంతో ఈ రెండింటిలో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరనున్నారు. రాష్ట్రంలో హైవేల విస్తరణపై కూడా చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రీజినల్‌ రింగ్‌రోడ్‌పై ఇప్పటికే డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించింది. కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు రక్షణశాఖకు చెందిన భూములను ఇవ్వాలని ప్రధానిని సిఎం కోరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ మంచినీటి కోసం మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకువచ్చిన తర్వాతే.. కేంద్రం ఘర్‌ఘర్‌ జల్‌ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర పథకానికి మిషన్‌ భగీరథను అనుసంధానం చేయాలని సీఎం ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయాన్ని అందించే అంశంపైనా ప్రధానితో సిఎం మాట్లాడనున్నట్లు సమాచారం.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon