• Neti Charithra

తిరుమల లో ముగిసిన మూడు రోజుల జ్యేష్ఠా భిషేకం !


తిరుమల లో ముగిసిన మూడు రోజుల జ్యేష్ఠా భిషేకం !




తిరుమల: నేటి చరిత్ర


తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాభిషేకం శ‌నివారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పున‌ర్ద‌ర్శ‌న‌మిచ్చారు. మళ్లీ జ్యేష్టాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు

ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్పస్వామివారికి, దేవేరులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు

నిర్వహించారు.సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.


28 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon