• Neti Charithra

తిరుమల దర్శనానికి.. విధి విధానాలు.. ఖరారు చేసిన ప్రభుత్వం !


తిరుమల దర్శనానికి.. విధి విధానాలు.. ఖరారు చేసిన ప్రభుత్వం !



అమరావతి: నేటి చరిత్ర


దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ 5.0 సడలింపుల్లో భాగంగా జూన్‌ 8 నుంచి ఆలయాలను తెరవడానికి కేంద్రం అనుమతించింది. కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు కేంద్రం

పొడిగించినా మరిన్ని సడలింపులను ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, జూన్‌ 8 నుంచి ఆలయాలు, ప్రార్ధనా స్థలాలు తెరుచుకోనున్నాయి. ఇక్కడా నిబంధనలున్నాయి. ఆలయాల్లో గంటకు 300 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి

అనుమతి ఇవ్వనున్నారు. అది కూడా అంతరాలయంలోకి ప్రవేశం లేకుండా కేవలం లఘు దర్శనానికే పరిమితం చేస్తారు. ఆలయాల్లో దర్శనాలకు అనుమతిస్తూ.. కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై దేవాదాయ శాఖ పలు మార్గదర్శకాలను రూపొందించి వైద్యారోగ్య శాఖ అనుమతి కోసం పంపింది. వైద్యారోగ్య శాఖ వీటిని ఆమోదించి అధికారిక

ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్‌ 8 నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తెరిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఐదో విడత లాక్‌డౌన్‌లో ఆలయాలను తెరవడానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఈ మేరకు టిటిడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే దర్శనాలకు అనుమతించనున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు కరెంట్‌ బుకింగ్‌, ఆన్‌లైన్‌ ద్వారా టైమ్‌ స్లాట్‌ టిక్కెట్లు జారీ చేయనున్నారు. తిరుమలకు వచ్చేవారికి తప్పనిసరిగా మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలనే నిబంధనలు అమలు కానున్నాయి.

180 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon