• Neti Charithra

తిరుపతి వద్ద రోడ్డు ప్రమాదం.. 9 మంది పరిస్థితి విషమం!

#తిరుపతి వద్ద రోడ్డు ప్రమాదం.. 9 మంది పరిస్థితి విషమం!

తిరుపతి : నేటి చరిత్ర (డిసెంబర్13) చిత్తూరు జిల్లా తిరుపతి సమీపం లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడ్డ 9 మంది పరిస్థితి ఆందోళనకారం గా మారింది. పోలీసుల కథనం మేరకు.. ఊతుకోట పక్కన ఉన్న కాశిరెడ్డి పేట గ్రామానికి చెందిన 28 మంది వరినాట్లు కూలీలు ఏర్పేడు మండలానికి ఆటోలో బయలుదేరారు. రేపాల పట్టు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్‌తోపాటు, కూలీలందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. 20 మంది క్షతగాత్రులను వెంటనే పిచ్చాటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 9మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని పుత్తూరు, తిరుపతి, చెన్నై ఆస్పత్రులకు తరలించారు. పిచ్చాటూరు తహసీల్దారు సుబ్రహ్మణ్యం, ఎస్సై దస్తగిరి, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon