• Neti Charithra

తిరుపతి లో పూర్తిస్థాయి మద్యనిషేధం కు టీటీడీ కీలకనిర్ణయం!

#తిరుపతి లో పూర్తిస్థాయి మద్యనిషేధం కు టీటీడీ కీలకనిర్ణయం!

తిరుమల: నేటి చరిత్ర (అక్టోబర్23) ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి పాలక మండలి తీర్మానం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్విమ్స్‌ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో తితిదే ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేస్తామని చెప్పారు. తితిదే పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ బోర్డు తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. మార్పులు, చేర్పులతో గరుడ వారధిని పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. తిరుపతిలో మద్యపాన నిషేధంపై చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఎంపిక చేసిన శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులకు ‘బ్రహ్మోత్సవ బహుమానం’ అందిస్తామన్నారు. దీనిలో భాగంగా శాశ్వత ఉద్యోగులకు రూ.14వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6,850 ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. తిరుమలలో మూడు నెలల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలని తీర్మానించినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తితిదే పరిధిలోని 162 మంది అటవీ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని నిర్ణయించామన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుపతిలో ‘శ్రీవారి భక్తిధామం’ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భక్తులు దర్శనానికి వెళ్లేవరకు నిరీక్షించకుండా శ్రీవారి భక్తిధామంలో గడిపేందుకు వీలుగా దీన్ని నిర్మిస్తున్నామన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon