• Neti Charithra

తిరుపతి లో ప్రజా సంఘాల ఆద్వర్యం లో నిరసనలు!

#తిరుపతి లో ప్రజా సంఘాల ఆద్వర్యం లో నిరసనలు!

తిరుపతి: నేటి చరిత్ర (అక్టోబర్12) తిరుపతి గరుడ వారధి పై చర్చకు బీజేపీ నేతలు సిద్దమా అని విద్యార్థి యువజన ప్రజా సంఘాల నేతలు సవాల్ విసిరారు. శనివారం ఉదయం తిరుపతి టీటీడీ పరిపాలన భవనం వద్ద విద్యార్థి యువజన ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అంతకు ముందు భవాని నగర్ సర్కిల్ నుండి ర్యాలీ గా వచ్చారు. ఈ ధర్నా నుద్దేశించి *ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి (ఆప్స్) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాజారెడ్డి* *భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీ వై ఎఫ్ ఐ) జిల్లా కార్యదర్శి యస్. జయచంద్ర* , *నవసమాజ ఫెడరేషన్ (ఎన్ ఎస్ ఎఫ్) అధ్యక్షుడు నీరుగట్టు నగేశ్* లు మాట్లాడుతూ గరుడ వారధి పై చర్చకు బీజేపీ నేతలు సిద్దమా అని సవాల్ అని అన్నారు. తిరుపతి లో ప్రజలందరూ బీజేపీ అంటే ఏహ్య భావంతో వున్నారని విమర్శించారు. గత వారం రోజుల నుండి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే బీజేపీ నేతలు ఏ మాత్రం స్పందించ లేదంటే తప్పు ను వొప్పుకొన్నట్లే నని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీటీడీ అధికారులు కుంటిసాకులు చెప్పడం తగదన్నారు గరుడ వారధి పనులు పూర్తి కాక పోవడం వలన దేశం రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు బస్టాండ్, రైల్వే స్టేషన్ కు ఆటోల ద్వారా నిర్ణీత సమయం నికి చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టీటీడీ నిధులు ప్రథమంగా అభివృద్ధికి కేటాయించాలని కోరారు. గరుడ వారధి సకాలంలో పూర్తి చేసి తిరుపతి ట్రాఫిక్ సమస్య ను వెంటనే పరిష్కరించాలని కోరారు. బీజేపీ నాయకులు వెంటనే హైకోర్టు లో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆప్స్ రాష్ట్ర అధికార ప్రతినిధి *రఫీ హిందుస్థానీ*, డీ వై ఎఫ్ ఐ నాయకులు *నరేంద్ర*, *సుమన్* లు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లే రోగులకు అంబులెన్స్ లు ఆటోలు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కకొని పోయి ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొన్నద నీ అన్నారు. గరుడ వారధి పనులు కు వెంటనే టీటీడీ చైర్మన్ ఈవో వెంటనే స్పందించి మొదటి విడతగా 150 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జ డీ వై ఎఫ్ ఐ నాయకులు సురేష్, భాస్కర్, వంశీ ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు బాలాజీ రావు, రాజ్కుమార్, ఆప్స్ నాయకులు షేక్ మహమ్మద్ రఫీ, పెదరాయుడు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు సుమన్ మరియు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon