• Neti Charithra

తిరుపతి లో టాస్క్ ఫోర్స్ పోలీసుల ఫై బరి తెగించిన స్మగ్లర్ లు..

#తిరుపతి లో టాస్క్ ఫోర్స్ పోలీసుల ఫై బరి తెగించిన స్మగ్లర్ లు..

తిరుపతి: నేటి చరిత్ర (ఆగష్టు27) శేషాచలం అడవుల్లోని రాజమాను గుంట వద్ద మంగళవారం తెల్లవారుజామున ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులపై ఎదురుదాడి చేసి పరారయ్యారు. తిరుపతి పరిసరాల్లోని ఈతమాను గుంట, చీకటిగలకోన, కల్యాణి డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూంబింగ్‌ చేస్తుండగా... మంగళవారం తెల్లవారుజామున తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు తారసపడ్డారు. పోలీసులను చూసిన వెంటనే స్మగ్లర్లు, ఎర్రచందనం దుంగలను అక్కడే వదిలేసి పోలీసులపై రాళ్లతో దాడి చేసి చీకట్లో తప్పించుకున్నారు. ఘటనా స్థలంలో ఓ స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 9 ఎర్రచందనం దుంగలను సీజ్‌ చేశారు. పరారీలో ఉన్న 9 మంది స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టారు.

13 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon