• Neti Charithra

తిరుపతి లో ఐదు జిల్లాల పోలీసులకు అరుదైన శిక్షణ.. ఇచ్చిన కేంద్ర బలగాలు..!


తిరుపతి లో ఐదు జిల్లాల పోలీసులకు అరుదైన శిక్షణ.. ఇచ్చిన కేంద్ర బలగాలు..!




తిరుపతి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా తిరుపతి లో వివిఐపి ల రక్షణపై ఆరు జిల్లాల పోలీసు వాహన డ్రైవర్ లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ అధ్వర్యంలో NSG మరియు ఇంటలిజెన్స్ & సెక్యూరిటీ వింగ్ అధికారులు ISW DSP డి.కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ రాజు, NSG యస్.ఐ జానకిరాం శిక్షణ ఇచ్చారు.

వి.ఐ.పి, వి.వి.ఐ.పి 6 జిల్లాల వాహనాల శ్రేణి వారికి రెండు రోజులు శిక్షణా

కార్యక్రమం తిరుపతి వెటర్నరి కాలేజి గ్రౌండ్ నందు జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమం నందు వి.ఐ.పి, వి.వి.ఐ.పి వాహనాలను నడుపు సందర్భంలో ఏ ఏ ప్రాంతంలో వి.ఐ.పి ని తీసుకొని వెళ్ళునప్పుడు వాహనాలను ఏ రోడ్డు వస్తే ఎలా జాగ్రత్తగా నడపాలి, పబ్లిక్ ఉన్న ప్రదేశాలు, సాదారణ రోడ్డు, ఘాట్ రోడ్డు, సమస్యాత్మకమైన రోడ్డు, ఫారెస్ట్ ప్రాంతం మొదలగు ప్రాంతాలలో వాహనాలను ఎటువంటి జగ్రత్తలు తీసుకొని నడపాలి అనే దానిపై మరియు వాహనంలో

వి.ఐ.పి ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం సంబవించినప్పుడు వి.ఐ.పి ని ఎలా రక్షించాలి, ఎలా రక్షణ కల్పించాలి తెసుకోవలసిన జాగ్రత్తలపై క్షుణ్ణంగా రెండు రోజుల పాటు పోలీస్ డ్రైవర్లకు శిక్షణ కల్పిం

చారు.ఈ శిక్షణా కార్యక్రమంలో తిరుపతి అర్బన్ జిల్లా, చిత్తూర్, అనంతపూర్, కుర్నూల్, కడప, నెల్లూర్ జిల్లా లు పాల్గొన్నాయి.


ఈ కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ యస్.పి శ్రీమతి సుప్రజ , ఏ.ఆర్ డి.యస్.పి నంద కిషోర్, హోంగార్డ్ డి.యస్.పి లక్ష్మణ్ కుమార్, యం.టి.ఓ ఆర్.ఐ రెడ్డప్ప రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.


141 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon