• Neti Charithra

తిరుపతి లో ఆటో వర్కర్ కార్మికులకు .. నిత్యవసర వస్తువులు పంపిణీ !


తిరుపతి లో ఆటో వర్కర్ కార్మికులకు .. నిత్యవసర వస్తువులు పంపిణీ !


తిరుపతి: నేటి చరిత్ర

తిరుపతి లోని బైరాగిపట్టెడలోని శ్రీకల్యాణ వెంకటేశ్వర ఆటో యూనియన్ డ్రైవర్లకు *ప్రజానేస్తం వ్యవస్థాపక అధ్యక్షులు, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎన్. రాజారెడ్డి* అభ్యర్థన మేరకు టి టి డి పరిపాలన భవన వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ మరియు ఆయన చిన్న నాటి స్నేహితుడు శ్రీహరి సహకారంతో 50 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులను అందజేశారు.

ఈ సందర్భంగా *ఆర్కాట్ కృష్ణ ప్రసాద్* మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ నేపథ్యం లో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు ప్రజానేస్తం అధ్యక్షులు రాజారెడ్డి అభ్యర్థన మేరకు నిత్యావసర వస్తువులు పంపిణీచేశామని తెలిపారు. ఆటో డ్రైవర్లు సామాజిక దూరాన్ని పాటించి కరోనా ను తరిమికొట్టాలని కోరారు.

ఈ కార్యక్రమం లో ప్రజానేస్తం కార్యదర్శి షేక్ మహమ్మద్ రఫీ, యశోద, పెదరాయుడు, ఆటో యూనియన్ నాయకులు మునికృష్ణ, బాలకృష్ణ, పళని, తదితరులు పాల్గొన్నారు.



34 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon