• Neti Charithra

తిరుపతి ఈ ఎస్ ఐ ఆస్పత్రిలో.. కరోనా సేవలు..- కలెక్టర్ భరత్ గుప్తా..!


తిరుపతి ఈ ఎస్ ఐ ఆస్పత్రిలో.. కరోనా సేవలు..- కలెక్టర్ భరత్ గుప్తా..!



తిరుపతి: నేటి చరిత్ర


తిరుపతి నగరం, ఆర్. సి. రోడ్డు లోని కార్మిక రాజ్య బీమా (ఈ. ఎస్. ఐ)ఆసుపత్రిలో రెండు, మూడు రోజుల్లోగా కోవిడ్ కేసులకు సేవలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. భరత్ నారాయణ గుప్తా ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఈ. ఎస్. ఐ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాధి గ్రస్తులకు కేటాయించిన వార్డుల్లో సౌకర్యాలను జిల్లా అధికారులు, డాక్టర్లతో

కలసి పరిశీలించారు.తిరుపతి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ సహకారంతో స్విమ్స్, రుయా, ఈ. ఎస్. ఐ ఆసుపత్రిలు అన్ని సమన్వయం చేసుకుని న్యాయ శాఖ , తిరుపతి డాక్టర్లు, ఇతర ముఖ్య శాఖల అధికారులు, ఉద్యోగులు వంటి ప్రత్యేకమైన వారికోసం ఈ. ఎస్. ఐ. ఆసుపత్రిలో ప్రాథమిక(మైల్డ్)స్థాయి కోవిడ్ కేసులకు సేవలు అందిచాలని నిర్ణయించారు. అనంతరం ఆసుపత్రిలో తిరుపతి IMAశాఖ డాక్టర్ల ప్రతినిధులు,స్విమ్స్, ఆరోగ్య శ్రీ,APMSIDC, వైద్యశాఖ, కోవిడ్ నోడల్ వంటి జిల్లా అధికారులు,ఈ. ఎస్. ఐ ఆసుపత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో అవసరమైన

మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు సేవలను అందించడంలో ఉద్యోగులు, డాక్టర్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే వారిపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్, ఇతర అధికారులను ఆదేశించారు.అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా"తిరుపతి శ్రీనివాసం "కోవిడ్ సెంటర్ లో రోగులకు భోజన సదుపాయాలనాణ్యత విషయమై కొంతమందిరోగులు చేసిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూఈ విపత్కర పరిస్థితుల్లో తాము తమ శాయశక్తుల మేరకు అన్ని సౌకర్యాలు, భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని, ఇక ఆరోపణలు చేస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి నగరంలో రోజు, రోజుకు పెద్ద ఎత్తున కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయని,ప్రజలు రోడ్లపైకి రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేసులు భారీగా వస్తున్న నేపథ్యంలో తిరుపతి శ్రీనివాసం, పద్మావతి నిలయం వంట ఇతరి కోవిడ్ సెంటర్లలో పడకలని పెంచుతున్నట్లు చెప్పారు. కలెక్టర్ సమావేశంలోజాయింట్ కలెక్టర్ వీర బ్రహ్మం(డెవెలప్ మెంట్)తిరుపతి ఈ ఎస్.ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ కె. బాలశంకర్ రెడ్డి, స్విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ వెంగమ్మ, తిరుపతి IMA శాఖ ప్రతినిధులు డాక్టర్లు. శ్రీ హరి రావు,రవిరాజు, కృష్ణ ప్రశాంతి,యుగంధర్,కోవిడ్ నోడల్ అధికారులు చంద్ర శేఖర్(SVIMS) రవణారెడ్డి(ESI), APMSIDC ఈ. ఈ. దనుంజయ రెడ్డి, ఈ. ఎస్. ఐ. ఆర్. ఎం. ఓ. డాక్టర్. కల్పలత, ఇతర అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు


216 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon