• Neti Charithra

తిరోగమనం లో.. జగన్ ప్రభుత్వం- కర్నూలు సభలో చంద్రబాబు

#తిరోగమనం లో.. జగన్ ప్రభుత్వం- కర్నూలు సభలో చంద్రబాబు

కర్నూలు: నేటి చరిత్ర (డిసెంబర్2) ఏపీ లో తిరోగమనం లో వైసీపీ పాలన నడుస్తోందని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా లో సోమవారం జరిగిన పార్టీ సమీక్షలో ప్రసంగించారు. ముఖ్యంగా ... పెన్షన్లు 200 నుండి 2000 వేలు చేసిన ఘనత టీడీపీ ది అని.. వైసీపీ కేవలం 250 మాత్రమే పెంచిందని రైతు రుణమాఫీ కోసం కోర్టుకు వెళ్తే రైతులకు తప్పకుండా మాఫీ అవుతుందని బాబు గారు అన్నారు. తెలుగుదేశం హయాంలో మిగులు కరెంట్ ఉంది. వైసీపీ ప్రభుత్వం లో కరెంటు కోతలు అంటూ వైసీపీ ప్రభుత్వం కేవలం రద్దుల ప్రభుత్వం అని విమర్శించారు. బీదల కోసం పెట్టిన అన్న కాంటీన్ లు రద్దు చేశారు. చివరికి వాటికి కూడా సిగ్గులేకుండా రంగులు వేసుకున్నారు అని విమర్శించారు. పెళ్ళి కానుక, చంద్రన్న భీమా కూడా రద్దు చేశారు. పండుగ కానుకలు కూడా రద్దు చేశారు సన్న బియ్యం అన్నారు కానీ దాని అడ్రస్ కూడా లేదన్నారు. యువనేస్తం రద్దు చేశారు విదేశీ విధ్య పథకం రద్దు చేశారు. ఇళ్ళ నిర్మాణం కూడా పూర్తిగా ఆపేశారు. అందరికీ ముద్దులు పెట్టి అన్ని పథకాలు రద్దు చేశారు. అమ్మ ఒడి ఇద్దరికి అని ఇప్పుడు కేవాలం ఒక్కరికే ఇస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పట్టించుకోవడం లేదు. ఎవడబ్బా సొమ్ము మీ వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారని నిలదీశారు. విజయసాయి రెడ్డి 90 శాతం మనకే వచ్చాయి కదా అన్న వీడియో ని సాక్ష్యం గా చెప్పారు. ఆఖరికి ఇది రంగుల ప్రభుత్వం మాత్రమే అన్నారు. అన్ని ప్రభుత్వ భవనాలకు, బడులకి, చివరికి గుడులలో, స్మశానాలకి కూడా రంగులు వేసుకుంటున్నారని విమర్శించారు. వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చినప్పుడు అబ్దుల్ కలాం గారు, సోనియాగాంధీ గారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు కానీ జగన్ కి మాత్రమే ఈ వెసులుబాటు ఎందుకు అన్నారు.

మద్యపానం నిషేదించాలి అనుకుంటే నిషేదించాలి కానీ రేట్లు ఎందుకు పెంచుతున్నారని అన్నారు. వాస్తవానికి తెలుగు మీడియంతో పాటుగా ఇంగ్లీష్ మీడియం కూడాప్రతి స్కూల్ లో ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వం దే అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం తెలుగు ని రద్దు చేయాల్సిన అవసరం ఏముందని అన్నారు.