• Neti Charithra

తంబల్లపల్లె లో మూడు "కీలక" శాఖల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు..!


తంబల్లపల్లె లో మూడు "కీలక" శాఖల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు..!




చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా తంబల్లపల్లె నియోజకవర్గం లో మూడు ప్రధాన శాఖలకార్యాలయాల ఏర్పాటు కు ప్రభుత్వం నిర్ణయించింది.

నియోజకవర్గ పరిధిలో పంచాయతీ రాజ్, ఇరిగేషన్, R&B,RWS శాఖలకు చెందిన కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్త సంబంధింత అధికారులను ఆదేశిం చారు.బుధవారం

కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా

కలెక్టర్ సిపిఓ ఆనంద నాయక్, ఆర్&బి ఎస్.ఈ దేవా నం దం, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ విజయ్ కుమార్,సిరి కల్చర్ జెడి అరుణకుమారి,ఐసిడి ఎస్ పిడి ఉషా ఫణికర్,ఇరి గేషన్ డిప్యూటీ ఎస్.ఈ నాగ భూషణం, ఉద్యానవన శాఖ డిడి శ్రీనివాసులు, పం చాయతీ రాజ్ శాఖ ల అధి కారులతో సమావేశమై ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే ఐసిడిఎస్, సిరి కల్చర్, ఉద్యానవన శాఖ లకు చెందిన కార్యాలయా లు పని చేయడం జరుగు తున్నదని.. ప్రధాన శాఖలు వారి శాఖా కార్యకలాపాలు ఆ నియోజకవర్గ పరిధిలో ఉండి జరపడం ద్వారా ప్రజలకు మరింత సత్వర సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని ఈ దిశగా అధికారులు కృషి చేయాలన్నారు.. పంచా యతీ రాజ్, ఆర్ &బి, ఇరి గేషన్, ఆర్ డబ్ల్యూఎస్ శాఖ ల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని

ఆదేశించారు. తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధి లో సంబంధిత కార్యా లయాలు ఏర్పాటుకు ప్రభు త్వ భవనాలు అందు బాటు లో లేవని.. ఆ కార్యాల యా ల కు సంబంధించిన అధికా రులు మదనపల్లి సబ్ డివి జన్ కార్యాలయం నుండి విధులను నిర్వర్తించడం జరుగుతున్నదని

జిల్లా కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకొని రాగా ... స్పందిం చిన జిల్లా కలెక్టర్ తంబళ్ల పల్లి నియోజకవర్గ పరిధిలో మరియు తంబళ్లపల్లె లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠ శాల భవనాలు,హాస్టల్స్,ఇ తర ప్రభుత్వ కార్యాల యా లకు సంబంధించిన సమా చారం ను డీఈ ఓ నుండి సేకరించాలని సిపిఓ ఆనంద నాయక్ ఆదేశించా రు. దింతో ఆయా శాఖల అధికారులు ఈ కార్యాలయాల ఏర్పాటుకు నియోజక వర్గ కేంద్రం తంబల్లపల్లెలో ఏర్పాటు చేస్తారా... లేక నియోజక వర్గంలో ప్రధాన మండలం గా ఉన్న బి కొత్తకోట లో ఏర్పాటు చేస్తారా.. అన్న సందిగ్ధం నెలకొంటోంది.


1,205 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon