• Neti Charithra

తంబల్లపల్లి కు దేశం లోనే.. అతి పెద్ద రెండవ పరిశ్రమ ను మంజూరు చేసిన కేంద్రం!



తంబల్లపల్లి కు దేశం లోనే.. అతి పెద్ద రెండవ పరిశ్రమ ను మంజూరు చేసిన కేంద్రం!




కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా తంబల్లపల్లి నియోజక వర్గం లో వేలాది కుటుంబాలకు ఉపయోగ పడే

అతి పెద్ద పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్తూరు జిల్లాలోని తంబల్లపల్లి, పుంగనూరు, పీలేరు, మదనపల్లె , కురబలకోట, బి కొత్తకోట,పరిసరాల్లో చింతపండు సేకరణ, అమ్మకాలు, శుద్ధిపనులు చేసేకుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. చింతపండు ప్రాసెసింగ్ పరిశ్రమ

ఏర్పాటు కోసం ఈ ప్రాంత ప్రజలు కొన్నేళ్ళు గా కోరుతున్నారు. ఈ నేపథ్యం లో తంబల్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి సహకారం..ఎంపీ మిథున్ రెడ్డి చొరవ తో కేంద్రం రూ.3.52 కోట్ల తో దేశం లో అతి పెద్ద

రెండవ చింత పండు పరిశ్రమ మంజూరు చేసింది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు కురబలకోట మండలం లో ఎకరా స్థలం ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. ఈ చింతపండు పరిశ్రమ తో తంబల్లపల్లి నియోజకవర్గ ప్రాధాన్యత మరింతగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి.




2,506 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon