• Neti Charithra

తహసిల్దార్ విజయా రెడ్డి కేసులో.. మరొకరు మృతి!

#తహసిల్దార్ విజయా రెడ్డి కేసులో.. మరొకరు మృతి!

హైదరాబాదు: నేటి చరిత్ర (డిసెంబర్2) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హైదరాబాద్‌ సమీపం అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహన ఘటనలో సోమవారం మరొకరు మృతి చెందారు. కంచన్‌ బాగ్‌ డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కార్యాలయ అటెండర్‌ చంద్రయ్య తుదిశ్వాస విడిచారు. అతనికి ఉదయం గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. విజయారెడ్డి కాలిపోతున్న సమయంలో ఆమెను కాపాడబోయి చంద్రయ్య తీవ్ర గాయాలపాలయ్యారు. అప్పటి నుంచి డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్క సారిగా గుండె పోటు రావడంతో చంద్రయ్య మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon