• Neti Charithra

తహసిల్దార్ కార్యాలయాల పై ఏసీబీ ఆకస్మిక దాడులు.. లక్షల్లో పట్టుపడ్డ నగదు..!


తహసిల్దార్ కార్యాలయాల పై ఏసీబీ ఆకస్మిక దాడులు.. లక్షల్లో పట్టుపడ్డ నగదు..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)



ఏపీ లోని పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు

బుధవారం ఏక దాటి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు తహసిల్దార్ ల వద్ద లక్షల్లో నగదు పట్టు పడింది.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.వివిధ జిల్లాల్లో

తహశీల్ధార్ కార్యాలయాలే లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తహసీల్దార్‌ కార్యాలయాలపై పలు ఫిర్యాదులు రావడంతో సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తహసీల్దార్‌ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి‌. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, విశాఖ జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. ఎమ్మిగనూరు, ఇబ్రహీంపట్నం, రాజుపాలెం, ఉలవపాడు, కూడేరు, కశింకోట తహశీల్దార్‌ కార్యాలయాల్లో రికార్డుల పరిశీలించారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిగాయ్‌. తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ నాయుడు కారులో రూ.2 లక్షలు స్వాధీనం

చేసుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్‌ కారులో లక్షరూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. అనధికార నగదును దాచేందుకు యత్నించి తహశీల్దార్‌ పట్టుబడ్డారు. తహశీల్దార్‌, సిబ్బందిని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.


487 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon