• Neti Charithra

తలనరికి స్టేషన్ కు వచ్చాడు!

Updated: Jul 21, 2019



నల్గొండ : నల్గొండ జిల్లా నాంపల్లిలో దారుణం జరిగింది. ఓ యువకుడిని అతి కిరాతకంగా నరికి చంపారు నిందితులు. వేట కొడవలితో దాడి చేయడమే కాకుండా.. తలను నరికేశారు. తలతో సహా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితులు లొంగిపోయారు. మృతుడిని నేరెళ్లపల్లికి చెందిన సద్దాంగా గుర్తించారు. హత్యకు వివాహేతర సంబంధం కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.


గౌస్ అనే వ్యక్తి సోదరితో సద్దాం వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడని..ఆయన వల్లే ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయిందని గతంలో సద్దాంపై కేసు న‌మోద‌యింది. ఈ కేసులో సద్దాం శిక్ష అనుభవించాడు. మూడు సంవత్సరాలు జైలు జీవితం కూడా గడిపినట్లు తెలుస్తోంది.


హైదరాబాద్ లో ఉంటున్న సద్దాం పని కోసం శ‌నివారం నేరెళ్లపల్లికి వచ్చి తిరిగి వెళ్తున్నారు. నాంపల్లి మండల కేంద్రం దగ్గర తారసడడంతో ఇతనే తన అక్కను చంపాడాని ఆగ్రహానికి గురైన గౌస్.. ఇర్ఫాన్ అనే మరో వ్యక్తి తల్వార్ తీసుకెళ్లి వెంటనే అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల వారు తేరుకునే లోపే ఘటన జరిగింది.

20 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon