• Neti Charithra

తమిళనాడు కు చెందిన ప్రముఖ నటుడు రాజశేఖర్ కన్ను మూత

# చెన్నై : నేటి చరిత్ర (సెప్టెంబర్8)

తమిళనాడు కు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ రాజశేఖర్‌ (61) మృతి చెందారు. ఆదివారం కన్ను మూశారు. ఈ విషయాన్ని విజరు టీవీ నిర్ధరిస్తూ వెల్లడించింది. ఈయన అనేక తమిళ సినిమాల్లోనూ, టెలివిజన్‌ షోల్లోనూ నటించారు. రాబర్డ్‌ రాజశేఖర్‌ ద్వయంలో ఇతనొకరు. రాబర్ట్‌ అశీర్వాదమ్‌, రాబర్ట్‌ రాజశేఖర్‌ ద్వయం దర్శకత్వంలో సినిమాలు తెరకెక్కేవి. 'పలైవనచోలై', 'చిన్నపూవే మెల్ల పేసు', 'దూరమ్‌ అధిగమించాలి', 'మనసుక్కుల్‌ మతప్పు', 'పరవైగల్‌ పలవిధమ్‌' వంటి చిత్రాలు వీరి ద్వయంలో వచ్చినవే. ఆశీర్వాదమ్‌, రాజశేఖర్‌ ద్వయం సినిమాటోగ్రాఫర్లుగా తమ కెరీర్‌ను ప్రారంభించారు. టి. రాజేందర్‌ దర్శకత్వంలో రూపొందిన 'అవుర్‌ తలై రంగమ్‌' చిత్రంతో వీరి కెరీర్‌ ప్రారంభమైంది. ఇప్పటికీ తమిళ సినిమా రంగంలో విభిన్నమైన కొరియెగ్రఫీ వచ్చిందంటే అది వీరి నుంచి అయి ఉంటుంది. అంతటి ప్రతిభావంతులు వీరిద్దరూ. ఇదే కాదు అనేక రంగాల్లో రాజశేఖర్‌ నిపుణుడు. రైటర్‌గా కూడా కొన్ని చిత్రాలకు ఈయన పనిచేయడం విశేషం. ఇవే కాకుండా ఇతనికి సినిమాలో ఉండే 24 క్రాఫ్ట్‌లోనూ తెలియనది అంటే ఉండదు. ప్రతి రంగంపైనా రాజశేఖర్‌కు అమితమైన పరిజ్ఞానం ఉండేది. భారతీయ రాజా దర్శకత్వంలో వచ్చిన 'నిజాల్‌గల్‌' చిత్రంలోని పాపులర్‌ గీతం 'ఇధు ఒరు పొన్న్‌ మాలై పోజుధు'కు వీళ్లే కొరియోగ్రఫీ అందించారు. నటుడిగా అనేక సినిమాల్లో చేశారు. విజరు టీవీ సీరియల్‌ 'సరవనమ్‌ మీనాక్షి' లో ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయన మృతికి తమిళ చిత్రసీమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.

18 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon