• Neti Charithra

తన కోరిక.. తీర్చని.. మహిళ పై యాసిడ్ దాడి!

#తన కోరిక.. తీర్చని.. మహిళ పై యాసిడ్ దాడి!

గుంటూరు: నేటి చరిత్ర (నవంబర్26) ఓ వివాహిత తన కోరిక తీర్చలేదని అగ్రహిస్తూ.. మరో యువకుడు మహిళ పై యాసిడ్ తో దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా లో హడలెత్తించింది. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో చోటుచేసుకుంది. ఈనెల 6న జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినుకొండ సీఐ చిన్నమల్లయ్య చెప్పిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గుట్ల ఉమ్మడివరానికి చెందిన మహిళ.. కూలి పనికోసం వినుకొండ మండలం తంగిరాలమెట్టకు వచ్చింది. అదే గ్రామానికి చెందిన దండిబోయిన ఆంజనేయులు.. కోరిక తీర్చమని ఆమెను వేధించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఎదురుతిరగడంతో తనపై యాసిడ్‌తో దాడిచేశాడని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ చిన మల్లయ్య తెలిపారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని.. పూర్తిస్థాయి విచారణ చేపడతామని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon