• Neti Charithra

ఢిల్లీ లో గెలిచిన ఎమ్మెల్లే.. పై తుపాకీ కాల్పులు... ఒకరు మృతి !

ఢిల్లీ లో గెలిచిన ఎమ్మెల్లే పై తుపాకీ కాల్పులు.. ఒకరు మృతి !

ఢిల్లీ: నేటి చరిత్ర (ఫిబ్రవరి12)

దేశ రాజధాని ఢిల్లీ లో అధికార పార్టీ ఎమ్మెల్లే పై అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి.దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ తరఫున మెహ్‌రౌలీ నియోజకవర్గం నుంచి గెలిచిన నరేశ్‌ యాదవ్‌ వాహనశ్రేణిపై గుర్తుతెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్త ఒకరు చనిపోగా, మరో కార్యకర్త గాయపడినట్లు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం నరేశ్‌ యాదవ్‌ ఆలయానికి వెళ్లి తిరిగి ఇంటికెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

78 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon