• Neti Charithra

డ్యూటీ లో వున్న ఎస్ ఐ బట్టలు.. ఊడపీకుతానన్న .. కేంద్ర మంత్రి !.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు !

#డ్యూటీ లో వున్న ఎస్ ఐ బట్టలు.. ఊడపీకుతానన్న .. కేంద్ర మంత్రి !.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు !

బీహార్: నేటి చరిత్ర (సెప్టెంబర్26) బీహార్ రాష్ట్రము లో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ అధికారిని కేంద్రమంత్రి అశ్విని చౌబే దారుణంగా అవమానించారు. పోలీస్ యూనిఫాం ఊడబీకేస్తానంటూ అందరి ముందు ఆయన చిందులు తొక్కడంతో... సదరు అధికారి ఆయనపై కేసుపెట్టారు. బీహార్‌లో జరిగిన ఓ ‘జనతా దర్బార్’ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బక్సర్‌లోని నయా భోజ్‌పూర్ అవుట్‌పోస్టు ఇంచార్జిగా ఉన్న ఎస్ఐ రాజీవ్ రంజన్ ఓ బీజేపీ కార్యకర్తకు ‘గూండా నోటీసులు’ జారీ చేయడంతో అతడు కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో మంత్రి అశ్విని చౌబే ఎస్ఐ రంజన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. ‘‘అతడు నీకు గూండాలాగా కనిపిస్తున్నాడా? నువ్వు ఎప్పుడైనా గూండాలను చూశావా? నీ తీరు మార్చుకోకుంటే.... నీ యూనిఫాం ఊడబీకేస్తా...’’ అంటూ మంత్రి ఆవేశంతో ఊగిపోయారు. ఇదంతా స్థానిక చానెళ్లలో ప్రసారం కావడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కాగా మంత్రి అశ్విని చౌబే తనపై బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఎస్ఐ రాజీవ్ రంజన్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే తాము ఇంకా మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon