• Neti Charithra

డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కు కరోనా.. అభిమానుల్లో.. టెన్షన్..టెన్షన్!


డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కు కరోనా.. అభిమానుల్లో.. టెన్షన్..టెన్షన్!



కడప: నేటి చరిత్ర


ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాతోపాటు ముగ్గురు కుటుంబ సభ్యులకు కరోనా తేలడం తో మెరుగైన వైద్య చికిత్సలు కోసం హైదరాబాద్ కు తరలించారు.

కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం అంజాద్ బాష ఆయన కుటుంబ సభ్యులు జ్వరం తో

ఇబ్బంది పడుతుండగా వైద్య పరీక్షలు చేయించారు.ఈ పరీక్షల్లో అంజాద్ బాషా తో పాటు ఆయన భార్య, కుమార్తెకు కరోనా సోకింది. కడప జిల్లాలో నిర్వహించిన

పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో శుక్రవారం రాత్రి 1 గంటకు వారు తిరుపతిలోని రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రికి (స్విమ్స్‌) చేరుకున్నారు. ఆ ముగ్గురికీ ప్రత్యేక గదిని కేటాయించి వైద్యం అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి

బాగుందని స్విమ్స్‌ సంచాలకురాలు భూమా వెంగమ్మ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం వారు హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లినట్లు ఆమె తెలిపారు. అంజాద్ బాష కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ రావడం తో అభిమానులు కలవర పాటుకు గురయ్యారు.



259 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon