• Neti Charithra

డిఎస్పీ ఇంట్లో.. ముగ్గురికి కరోనా.. పాజిటివ్.. మరో 21 మంది పై అనుమానాలు !


డిఎస్పీ ఇంట్లో.. ముగ్గురికి కరోనా.. పాజిటివ్.. మరో 21 మంది పై అనుమానాలు !


హైదరాబాద్: నేటి చరిత్ర


తెలంగాణా రాష్ట్రం కొత్తగూడెం కు చెందిన ఓ డిఎస్పీ ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ బయట పడటం కల కలం రేపుతోంది.

కొత్తగూడెం డీఎస్పీకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల లండన్ నుంచి ఆయన కుమారుడు కొత్తగూడెం వచ్చారు. డీఎస్పీ కుమారుడికి కూడా కరోనా సోకింది. అయితే దీనిని దాచిపెట్టిన ఆయన తన కుమారుడితో కలసి ఒక ఫంక్షన్ కు కూడా హాజరయ్యారు. దీంతో ప్రభుత్వం డీఎస్పీ, ఆయన కుమారుడిపై కేసు నమోదు చేసి క్వారంటైన్ లో ఉంచింది. వీరిద్దరూ దగ్గరగా తిరిగిన 21 మంది నమూనాలను పరీక్షలకు పంపారు. ఈరోజు నివేదిక వచ్చే అవకాశముంది. కాగా డీఎస్పీ ఇంట్లో వంటమనిషికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో కొత్తగూడెంను రెడ్ జోన్ గా ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు.




384 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon