• Neti Charithra

ట్రక్కు..ఢీ కొన్న ఘోర ప్రమాదం లో 16 మంది మృతి

#ట్రక్కు..ఢీ కొన్న ఘోర ప్రమాదం లో 16 మంది మృతి

షాజహాన్ పూర్: నేటి చరిత్ర (ఆగస్టు27) ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రక్కు అదుపుతప్పి రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24వ నంబరు జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు షాజహాన్‌పూర్‌లోని జంకా క్రాసింగ్‌ వద్ద అదుపుతప్పి ముందు వెళ్తున్న ఓ టెంపో‌, వ్యాన్‌ను ఢీకొట్టింది. ట్రక్కు వేగం కారణంగా వ్యాన్‌ రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. క్షణాల్లోనే ట్రక్కు కూడా వ్యాన్‌పై బోల్తాపడింది. ఈ ఘటనలో వ్యాన్‌లోని 16 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

1 view
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon