• Neti Charithra

టిప్పర్ ను ఢీ కొన్న స్కార్పియో... జాతీయ రహదారి పై ముగ్గురు మృతి!


టిప్పర్ ను ఢీ కొన్న స్కార్పియో... జాతీయ రహదారి పై ముగ్గురు మృతి!




డిచ్‌పల్లి : నేటి చరిత్ర


నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి సమీపం లో శనివారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతి చెందారు. స్థానిక పోలీసులు కథనం మేరకు..

ఐదుగురు వ్యక్తులు స్కార్పియో వాహనంవలో బిహార్‌ నుంచి కేరళలోని కోజికోడ్‌ ప్రాంతానికి వెళుతుండగా

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం నాక తండా వద్దకు రాగానే జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పర్‌ను స్కార్పియో వాహనం

ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గమనించిన స్థానికులు క్షతగాత్రులను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆనేశ్‌ (32), స్టాలిన్‌(21), అనాలియా(15) మృతి చెందారు. బాధితులు కేరళ రాష్ట్రానికి చెందిన వారు కాగా.. బిహార్‌ రాష్ట్రంలోని నౌడా ప్రాంతంలో ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్తూ ఇలా మృత్యువాత పడ్డట్టు సమాచారం.

126 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon