• Neti Charithra

జార్ఖండ్ లో కాంగ్రెస్ కు జై కొట్టిన జనం!

రాంచీ: నేటి చరిత్ర (డిసెంబర్23)

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల లో కాంగ్రెస్ కూటమి కి అక్కడి ప్రజలు జై కొట్టారు. అక్కడి ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు నిజమవుతున్నట్లు కన్పిస్తున్నాయి. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో కాంగ్రెస్‌-జేఎంఎం-ఆర్జేడీ మహాకూటమి మెజార్టీ మార్క్‌ దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ 4 స్థానాల్లో గెలిచి మరో 10 చోట్ల ముందంజలో ఉండగా.. జేఎంఎం 5 స్థానాల్లో గెలిచి 23 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆర్జేడీ 3 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మొత్తంగా ఈ కూటమి 45 స్థానాల్లో(ఆధిక్యం+గెలుపు) జోరు కొనసాగిస్తోంది. మొత్తం 28 స్థానాలతో జేఎంఎం అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. దీంతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్‌, ఆర్జేడీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని హేమంత్‌ మరికొద్ది గంటల్లో గవర్నర్‌ను కోరే అవకాశముంది.

ఇక తాజా ఫలితాల్లో అధికార భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం భాజపా 6 చోట్ల విజయం సాధించి.. మరో 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఏజేఎస్‌యూ ఒక చోట గెలిచి.. 2 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. జేవీఎం 3 చోట్ల, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

1 view
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon