• Neti Charithra

జాతీయ రహదారి పై.. కంటైనర్ వాహనం దగ్ధం..!


జాతీయ రహదారి పై.. కంటైనర్ వాహనం దగ్ధం..!



విజయనగరం: నేటి చరిత్ర

విజయనగరం జిల్లాబొండపల్లి మండలం అంబటివలస వద్ద జాతీయ రహదారిపై గల హైటెన్షన్‌ విద్యుత్తు తీగలు తగిలి ఓ లారీ మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో చోదకునికి స్వల్ప గాయాలయ్యాయి. గురువారం ఒడిశాలో సరకులను దించేసి

విశాఖపట్నం వెళ్తున్న ఖాళీ కంటైనర్‌ లారీ అంబటివలసకు వచ్చేసరికి విద్యుత్తు తీగలు తాకి మంటలు చెలరేగాయి. వెనుక వైపు టైర్లకు పెద్దగా మంటలు వ్యాపించాయి. స్థానికులు ఎస్‌ఐ డి.సాయికృష్ణకు సమాచారం అందించారు అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి

చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయాల పాలైన చోదకుడిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


220 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon