• Neti Charithra

జాతీయ రహదారి పై ఓవర్ టేక్.. చేయ బోయి కారు బోల్తా..ఐదుగురు మృతి.!


జాతీయ రహదారి పై ఓవర్ టేక్.. చేయ బోయి కారు బోల్తా..ఐదుగురు మృతి.!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


(ప్రమాద దృశ్యాలు)


తెలంగాణా లో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది.వరంగల్‌ జిల్లా దామోదర మండలంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం లో ఆరగొండ వద్ద లారీ, కారు ఢకొీన్న ఘటనలో కారులో

ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు మేకల రాకేశ్‌, మేడి చందు, రోహిత్‌, సాబీర్‌, పవన్‌గా పోలీసులు గుర్తించారు. ముందు వెళ్తున్న కారును ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పరకాల ఎసిపి శ్రీనివాస్‌ ఘటనా స్థలికి

చేరుకొని సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. మృతులు వరంగల్‌ జిల్లాలోని పోచం మైదాన్‌కు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


358 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon