• Neti Charithra

జమ్మూ కాశ్మిర్ లో ఎన్ కౌంటర్.. మోస్ట్ వాంటెడ్.. టెర్రరిస్టు మృతి

#జమ్మూ కాశ్మిర్ లో ఎన్ కౌంటర్.. మోస్ట్ వాంటెడ్.. టెర్రరిస్టు మృతి

న్యూఢిల్లీ : నేటి చరిత్ర (సెప్టెంబర్11) ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్‌లో ఐదేళ్ళ చిన్నారి గాయపడటానికి కారణమైన మోస్ట్‌ వాంటెడ్‌ లష్కరే తోయిబా టెర్రరిస్ట్‌ అసిఫ్‌ మక్బూల్‌ భట్‌ను బారముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతబలగాలు మట్టుబెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అసిఫ్‌ ఒక కారులో ప్రయాణిస్తుండగా చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అతను కారు ఆపకుండా దూసుకెెళ్ళాడు. దీంతో బలగాలు వెంబడించడంతో అసిఫ్‌ వారిపై కాల్పులు జరిపాడు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో అసిఫ్‌ మృతి చెందాడు. ఉగ్రవాదులు ఈ నెల 7న ఒక పండ్ల వ్యాపారి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆ వ్యాపారి మనవరాలు ఐదేళ్ళ అస్మా జాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆమె తండ్రి అరార్షద్‌ రాథర్‌తోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సోపోర్‌లోని పండ్ల మార్కెట్‌లో దుకాణాలను తెరిచినందుకు వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు..జమ్ము కాశ్మీర్‌ డిజిపి దిల్‌బాగ్‌ సింగ్‌ దీనిపై ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గాయపడిన జవానులిద్దరూ క్షేమంగానే ఉన్నారని అన్నారు.

12 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon